కేంద్ర పనితీరుకు ఆ ఫలితాలే నిదర్శనం: నడ్డా

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడిలో సమర్థవంతంగా పనిచేసిందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అందుకు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా, ఇతర రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Published : 21 Nov 2020 22:11 IST

సిమ్లా: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడిలో సమర్థవంతంగా పనిచేసిందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అందుకు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా, ఇతర రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన బిలాస్‌పూర్‌లో ఓ సమావేశంలో మాట్లాడారు.

‘కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం ఎంతో సమర్థవంతమైన చర్యలను చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రశంసించాయి’ అని నడ్డా వెల్లడించారు. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిసి కొతిపురాలో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ కేంద్రాన్ని సందర్శించారు. కొవిడ్‌-19 ఉన్నప్పటికీ నిర్మాణం త్వరగా పూర్తి చేసినందుకు ఆయన సంతృప్తి చెందారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఛండీగఢ్‌కు చెందిన వైద్య విద్య పరిశోధన కేంద్రం(పీజీఐఎంఈఆర్‌) డైరెక్టర్, ఎయిమ్స్‌ నిర్మాణ సంస్థ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సీఎం ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఆరోగ్య సేవల్లో ఈ వైద్యశాల ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డాకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని