ఆ విషయంలో ప్రభుత్వానికి మా మద్దతు

ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం పొరుగు దేశానికి సరైన జవాబు ఇస్తుందని ఆశిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఆమె తన మద్దతు........

Published : 17 Sep 2020 01:23 IST

లఖ్‌నవూ: ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం పొరుగు దేశానికి సరైన జవాబు ఇస్తుందని ఆశిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఆమె తన మద్దతు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇండో-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలకు ఆందోళన కలగజేస్తున్నాయి. భారత ప్రభుత్వం చైనాకు దీటైన జవాబు ఇస్తుందని బీఎస్పీ ధీమాతో ఉంది. అదేవిధంగా ఈ విషయంలో ఎదురయ్యే పరిణామాలపై భారత ప్రభుత్వానికి, సైన్యానికి మా మద్దతు ఉంటుంది’ అని ట్వీట్‌లో వెల్లడించారు. 

ఇప్పటికే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ.. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా ఎలాంటి కుట్రలకు దారి తీసినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎంత వరకైనా తెగిస్తామని, అందులో ఏ మాత్రం అనుమానం లేదని తెలిపారు. సరిహద్దుల్లో ఇప్పటికే భారత సైనిక దళాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని