చైనా టీకాపై బహ్రెయిన్‌ కీలక నిర్ణయం..!

మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న చైనా కరోనా వైరస్‌ టీకా సినోవాక్‌ విషయంలో బహ్రెయిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా టీకాను తమ దేశంలో మంగళవారం నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అందరికీ అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించింది.

Published : 03 Nov 2020 20:21 IST

అబుదాబి: మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న చైనా కరోనా వైరస్‌ టీకా విషయంలో బహ్రెయిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా టీకాను తమ దేశంలో మంగళవారం నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌(వైద్య సిబ్బంది) అందరికీ అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. బహ్రెయిన్‌ ఆరోగ్య మంత్రి ఫైఖా బింట్‌ సయీద్‌ మాట్లాడుతూ.. ‘ఈ టీకా మొదటి, రెండో దశ ట్రయల్స్‌కు సంబంధించిన సురక్షిమైన ఫలితాలు వచ్చాయి. మూడోదశ ట్రయల్స్‌ కూడా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా కొనసాగుతున్నాయి. మూడో దశలో భాగంగా 7వేల మంది వాలంటీర్లకు టీకా రెండో డోసును ప్రయోగించారు. అత్యయిక పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని కాపాడుకొనేందుకు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయించాం’అని తెలిపారు. 

అబుదాబికి చెందిన కృతిమమేధ సంస్థ జీ42తో భాగస్వామ్యంతో చైనాకు చెందిన సినోఫాం వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిర్వహిస్తోంది. కాగా యూఏఈ సైతం ఈ టీకాను ఇదే తరహాలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అత్యవసరంగా ఉపయోగించడానికి సెప్టెంబర్‌లో అనుమతించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని