వక్రమార్గంలో పీఠం ఎక్కాలనుకోవద్దు: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు తేలాల్సి ఉంది. ఓ వైపు చరిత్రాత్మక విజయానికి డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేరువవుతుండగా.. మరోవైపు ట్రంప్‌ విజయావకాశాలు అంతకంతకూ సన్నగిల్లుతున్నాయి. ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని, గడువు పూర్తయినా...

Updated : 07 Nov 2020 09:33 IST

బైడెన్‌ను విమర్శిస్తూ ట్వీట్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు తేలాల్సి ఉంది. ఓ వైపు చరిత్రాత్మక విజయానికి డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేరువవుతుండగా.. మరోవైపు ట్రంప్‌ విజయావకాశాలు అంతకంతకూ సన్నగిల్లుతున్నాయి. ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని, గడువు పూర్తయినా పోస్టల్‌ బ్యాలెట్లను స్వీకరిస్తున్నారని ఆరోపిస్తూ తాజా ఫలితాలపై కోర్టుకు వెళ్తానని చెబుతున్న ట్రంప్‌.. మరోసారి ప్రత్యర్థి  బైడెన్‌పై  తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య రాజ్యంలో వక్రమార్గంలో అధ్యక్షపీఠాన్ని అధిరోహించాలనుకోవద్దని ఆరోపించారు. ‘‘ బైడెన్‌.. తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించుకోకూడదు. అలా నేనూ చేయగలను. ఇప్పుడే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందు నుంచి ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాలోనూ బైడెన్ ఆధిక్యంలోకి రావడంతో ట్రంప్‌ ఓటమి అంచులకు చేరుకుంటున్నారు. 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న జార్జియాలో 99 శాతం మేర ఇప్పటికే ఓటింగ్‌ పూర్తయింది. 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 96శాతం లెక్కింపు పూర్తయింది. మరోవైపు 6 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న నెవాడాలో ముందు నుంచే బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో  ఏ ఒక్క చోట గెలుపొందినా బైడెన్‌ విజయం  ఖాయమవుతుంది. నార్త్‌ కరోలినా, అలస్కా రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లను కైవసం చేసుకోగా అధ్యక్షుడు ట్రంప్‌ 214 ఓట్లతో వెనకంజలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని