
బీరుట్ బ్లాస్ట్: 190కి చేరిన మృతులు!
దెబ్బతిన్న 50వేల ఇళ్లు, 3లక్షల మంది నిరాశ్రయులు
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో ఆగస్టు తొలివారంలో అత్యంత తీవ్రమైన పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 190కి చేరినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరో 6500 మంది గాయాలపాలైనట్లు లెబనాన్ ప్రభుత్వం పేర్కొంది. మొన్నటివరకు 170మంది చనిపోయినట్లు గుర్తించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 190కి చేరింది. మరికొందరి ఆచూకి కూడా లభించలేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా పేలుళ్ల ధాటికి నగరంలో 50వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పేలుళ్ల వలన కలిగిన నష్టం దాదాపు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని లెబనాన్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ భారీ పేలుళ్లకు పోర్టులో నిల్వ ఉంచిన రసాయనాలే కారణమని అధికారులు ఇప్పటికే తేల్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.