వచ్చే నెల్లోనే 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు

డిసెంబర్‌ కల్లా భారత్‌కు పది కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను అందచేయగలం

Published : 13 Nov 2020 18:46 IST

ముంబయి: డిసెంబర్‌ కల్లా భారత్‌కు పది కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను అందజేయగలమని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా ప్రకటించారు. దీంతో దేశ ప్రజలకు అదే నెలలో ఆస్ట్రాజెనెకా టీకాలు వేసేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రాజెనెకా చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే.. భారత్‌కు టీకాను పంపిణీ చేసేందుకు ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెసెంబర్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అనువుగా కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు లభించగలవనే ఆశాభావాన్ని సంస్థ సీఈవో వ్యక్తం చేశారు. తుదిదశ ప్రయోగాల్లో ఉన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నాలుగు కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు ఎస్‌ఐఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని