క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌

కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వేక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది.

Updated : 17 Jul 2020 21:07 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వేక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు  ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈ నెల 15న ప్రారంభించినట్లు  ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని 12 ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి కూడా ఉంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని