ఐకమత్యాన్ని పెంపొందించే పండుగలివీ..

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2(94) తన క్రిస్మస్‌ సందేశంలో భిన్నత్వాన్ని, ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించారు.

Published : 27 Dec 2020 14:55 IST

బ్రిటన్‌ రాణి క్రిస్మస్‌ సందేశంలో 
దీపావళి, వైశాఖి, ఈద్‌ ప్రస్తావన

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2(94) తన క్రిస్మస్‌ సందేశంలో భిన్నత్వాన్ని, ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌ కాలంలో జరుపుకొన్న దీపావళి, ఈద్, వైశాఖి లాంటి అన్ని ప్రధాన పండుగల గురించి ప్రస్తావించారు. కొన్ని దశాబ్దాల తర్వాత.. దేశంలోని ప్రజల ఆరోగ్యం కోసం చాలా మతాలు, ప్రాంతాలకు చెందిన వారు చేసిన కృషిని గుర్తు చేశారు. ఆమె ఇచ్చిన క్రిస్మస్‌ సందేశాన్ని ముందుగా రికార్డు చేసి ప్రసారం చేశారు. ‘‘ప్రస్తుతం క్రిస్మస్‌ వేడుకలను మునుపటిలాగా జరుపుకొనే పరిస్థితులు లేవు. వివిధ మతాలకు చెందిన వారూ.. ఈద్, ఈస్టర్, వైశాఖి లాంటి పండుగలకు సంబంధించి వేడుకలను బంధుమిత్రులతో కలిసి నిర్వహించుకోలేకపోయారు. దీపావళి.. ఆశావహ దృక్పథాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించే వెలుగుల పండుగ. హిందువులు, సిక్కులు, జైనులు అంతా దీపావళి జరుపుకోవడంతో రాజభవనంపై టపాసుల కాంతులు విరజిమ్మాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ పరిసరాల్లో.. కష్టాల్లో ఉన్న తోటివారికి అండగా నిలబడటం చూసి నేను, నా కుటుంబం ఎంతో స్ఫూర్తి పొందాము. 2021 అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా’’ అని ఎలిజబెత్‌ అన్నారు. కొవిడ్‌-19 టీకా ప్రయోగాలు సత్ఫలితాలనివ్వడం.. ఆధునిక శాస్త్ర సాంకేతికత సాధించిన విజయంగా పేర్కొన్నారు. మహమ్మారిపై బ్రిటన్‌ రాజీ పడకుండా పోరాటం చేయడం గర్వంగా ఉందన్నారు.         

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని