‘బుల్లెట్‌’ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం

ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో పురోగతి ఉందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ అన్నారు. అయితే, ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని..........

Published : 06 Sep 2020 01:07 IST


(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో పురోగతి ఉందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ అన్నారు. అయితే, ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. జపాన్‌ సహకారంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఆ లోగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ మాట్లాడారు.

మహారాష్ట్ర, గుజరాత్‌ పరిధిలో నడిచే ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తవ్వాల్సి ఉందని వీకే యాదవ్‌ తెలిపారు. గుజరాత్‌లో 82 శాతం భూసేకరణ పూర్తవ్వగా.. మహారాష్ట్రలో కేవలం 23 శాతం మాత్రమే పూర్తయ్యిందని తెలిపారు. పూర్తిస్థాయిలో భూమి అందుబాటులోకి వచ్చాకే ఇటువంటి ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేయగలమనేది ఒక అంచనాకు రాగలమని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. కొవిడ్‌ పరిస్థితులన్నీ చక్కబడ్డాక బిడ్డింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు ఎంత సమయం పడుతుందనేది విషయం చెప్పగలమని 3-6 నెలల్లో చెబుతామని వీకే యాదవ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని