తాజా అధ్యక్ష ఎన్నికల్ని విశ్వసించవచ్చు: బుష్‌

తాజా అధ్యక్ష ఎన్నికలు ప్రాథమికంగా ఎలాంటి అవినీతి లేకుండా జరిగాయని అమెరికా ప్రజలు విశ్వసించవచ్చని రిపబ్లికన్‌ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ.బుష్‌ అన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందన్నారు............

Published : 09 Nov 2020 13:44 IST

బైడెన్‌ విజయాన్ని గుర్తించిన ప్రముఖ రిపబ్లికన్‌ నేత

వాషింగ్టన్‌: తాజా అధ్యక్ష ఎన్నికలు ప్రాథమికంగా ఎలాంటి అవినీతి లేకుండా జరిగాయని అమెరికా ప్రజలు విశ్వసించవచ్చని రిపబ్లికన్‌ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ.బుష్‌ అన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అయితే, దేశం కోసం ప్రతి ఒక్కరూ తిరిగి ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రిపబ్లికన్‌ పార్టీలో ఆయన తర్వాత దేశాధ్యక్ష పదవి చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. 70 మిలియన్ల ఓట్లు సాధించడం రాజకీయపరంగా గొప్ప విజయమని ట్రంప్‌నకు పోలైన ఓట్లను ఉద్దేశించి అన్నారు. రీకౌంటింగ్‌ను కోరడంతో పాటు ఎన్నికల ఫలితాలపై చట్టపరంగా పోరాడే హక్కు ట్రంప్‌నకు ఉందని బుష్‌ గుర్తుచేశారు.

బైడెన్‌ విజయాన్ని గుర్తించి అభినందనలు తెలిపిన ప్రముఖ రిపబ్లికన్‌ నేతలలో బుష్‌ ఒకరిగా నిలిచారు. 2016లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన బుష్‌ సోదరుడు జెబ్‌ బుష్‌ ముందే బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరికొంత మంది రిపబ్లికన్‌ సెనెటర్లు సైతం బైడెన్‌ విజయాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి...

ఫలితాలు వచ్చినా.. మిగిలే ఉంది!
శ్యామల కూతురు...  అలా పిలిస్తేనే ఇష్టం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని