హాథ్రస్‌ ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ........

Published : 11 Oct 2020 13:34 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు ఈ ఘటనపై చాంద్‌పా పోలీసు స్టేషన్లో బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే. సెప్టెంబరు 14న తన సోదరిని నలుగురు వ్యక్తులు అత్యాచారం ఆపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని