చైనాలో సత్పలితాలిచ్చిన రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌

చైనాలో రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సురక్షితం అని తేలింది. రోగనిరోధశక్తిని పెంపొందిస్తుందని..

Published : 21 Jul 2020 23:44 IST

బీజింగ్‌: చైనాలో రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సురక్షితమని తేలింది. రోగనిరోధశక్తిని పెంపొందిస్తుందని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ కథనం వెల్లడించింది. భద్రత, రోగనిరోధకశక్తిని అంచనా వేసేందుకు పరీక్షలు చేసినట్లు పేర్కొంది. కాగా గత పరీక్షలతో పోలిస్తే ఈ దశలో ఎక్కువ మందిపై ట్రయల్స్‌ జరిపినట్లు, వీరిలో 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ టీకా కొవిడ్‌ నిరోధానికి సమర్థంగా పని చేస్తుందా అన్న అంశంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత తక్షణ ప్రతికూల ప్రభావం కోసం 30 నిమిషాలపాటు గమనించామని, తర్వాత 14 నుంచి 28 రోజుల వరకు పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌  తర్వాత వ్యాధి నిరోధకాలు ఉత్పత్తి అయినట్లు వెల్లడించారు. దుష్ప్రభావాలు తక్కువ మందిలోనే కనిపించాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని