వారికోసం ఈ ఏడాది చివరికే టీకాలు సిద్ధం!: యూఎస్‌

కరోనా వైరస్‌ నుంచి తక్షణ తీవ్రతను ఎదుర్కొనే అమెరికన్ల కోసం 2020 చివరినాటికి సురక్షితమైన టీకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆ దేశ వైద్య, ఆరోగ్య సేవల సెక్రటరీ అలెక్స్‌ అజార్ వెల్లడించారు.

Published : 22 Oct 2020 13:13 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నుంచి తక్షణ తీవ్రతను ఎదుర్కొనే అమెరికన్ల కోసం 2020 చివరినాటికి సురక్షితమైన టీకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆ దేశ వైద్య, ఆరోగ్య సేవల సెక్రటరీ అలెక్స్‌ అజార్ వెల్లడించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఫైజర్, మోడెర్నా నుంచి టీకాలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని, అమెరికన్లకు వాటిని అందించనున్నామని తెలిపారు. ఈ విషయంలో యూఎస్‌ ప్రభుత్వం ఆశాజనకంగా ఉందన్నారు. వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్‌పై పోరాటంలో నిమగ్నమైన ఇతర సిబ్బందికి జనవరిలో, మిగిలిన అమెరికన్లకు ఏప్రిల్‌లో టీకాను అందించే అవకాశం ఉందన్నారు. కాగా, అక్కడి టీకా అభివృద్ధి సంస్థలు నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందక మునుపే తయారీ సామర్థ్యంపై దృష్టి సారించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలో 85,84,819 మంది వైరస్‌ బారిన పడగా, 2,27,409 మంది మరణించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని