దిల్లీలో ఒకశాతం దిగువనే పాజిటివిటీ రేటు:జైన్

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి మెల్లగా తగ్గుముఖం పడుతుందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.

Published : 24 Dec 2020 23:29 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి మెల్లగా తగ్గుముఖం పడుతుందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. బుధవారం గణాంకాల ప్రకారం పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగువనే ఉందని మీడియాకు తెలిపారు. 

‘నిన్న దిల్లీలో 871 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 0.99శాతంగా ఉంది. అంటే ఒక శాతం దిగువనే ఉంది. గత మూడు రోజులుగా రోజూవారీ కేసులు 1,000లోపులోనే నమోదవుతున్నాయి. సంక్రమణ రేటు రెండు శాతానికి తక్కువగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది’ అని జైన్ వెల్లడించారు. కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన క్రమంలో..యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి పాజిటివ్‌గా తేలినప్పటికీ వారు ప్రభుత్వ పరిధిలో లేకపోవడంపై ఆయన స్పందించారు. ‘వారు ఇతర ప్రదేశాలకు వెళ్లరని నా నమ్మకం. దీనిపై విమానయాన అధికారులను సంప్రదించనున్నాం’ అని ఆయన వెల్లడించారు. 

ఇవీ చదవండి:

మొదటి దశలో 51లక్షల మందికి వ్యాక్సిన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని