ప్రజలకు టీకాను తప్పనిసరి చేయం

బ్రిటన్ ప్రజలు తమకు కొవిడ్-19 టీకా కావాలో, వద్దో నిర్ణయించుకోగలరని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ మంగళవారం వెల్లడించారు.

Published : 11 Nov 2020 02:18 IST

బ్రిటన్ ఆరోగ్య మంత్రి 

లండన్‌: బ్రిటన్ ప్రజలు తమకు కొవిడ్-19 టీకా కావాలో, వద్దో నిర్ణయించుకోగలరని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ మంగళవారం వెల్లడించారు. ప్రపంచమంతా టీకా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. 

‘మేము టీకాను తప్పనిసరిచేయాలని ప్రతిపాదించడం లేదు. చాలామంది ప్రజలు టీకాను వేయించుకోవాలని కోరుకుంటున్నారనుకుంటున్నాను. ఇది చిన్నారులకు మాత్రం కాదు. పిల్లలు కరోనా వైరస్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంది’ అని ఆ మంత్రి వెల్లడించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుండటంతో ఆ దేశం మరోసారి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 12 లక్షల మార్కును దాటింది. కాగా, ప్రపంచమంతా కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఆస్ట్రాజెనికా, ఫైజర్, మోడెర్నా సంస్థల టీకాల ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వాటికి త్వరలోనే తుది ఆమోదం లభించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని