హాథ్రస్‌ వెళ్లిన ఆప్‌ ఎమ్మెల్యేపై కేసు

హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఎమ్మెల్యే హాథ్రస్‌లో ప్రత్యక్షమవడంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు...

Published : 07 Oct 2020 14:10 IST

లఖ్‌నవూ: హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఎమ్మెల్యే హాథ్రస్‌లో ప్రత్యక్షమవడంతో ఆయనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా సోకిన ఐదు రోజులకే ప్రజల్లో తిరిగిన నేతపై అంటువ్యాధుల నివారణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దిల్లీలోని కోండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్దీప్‌కుమార్‌ తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని సెప్టెంబర్‌ 29న ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

అక్టోబర్‌ 2న పలు ట్వీట్లు చేస్తూ ప్రస్తుతం తాను హాథ్రస్‌లో ఉన్నానని, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినట్లు వీడియోలు జోడిస్తూ ట్వీట్లలో పేర్కొన్నారు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న వీడియో కూడా అందులో ఉంది. ఈ విషయం యూపీ పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సెప్టెంబర్‌ 14న ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ దళిత యువతిపై సామూహక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న మృతిచెందింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వైఖరితోపాటు యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని