జన గణన, ఎన్పీఆర్ ఈ ఏడాది లేనట్లే..!
దిల్లీ: దేశంలో కరోనా కారణంగా వాయిదా పడిన మొదటి విడత జన గణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఈ ఏడాదిలో జరిగే సూచనలు కనిపించడం లేదు. కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో ఏడాది ఆలస్యం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. జనగణన అనేది అంత అత్యవసరమైన ప్రక్రియేమీ కాదని, ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 2020లో జరిగే అవకాశమైతే లేదని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా వాస్తవానికి ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సి ఉంది. కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. పదేళ్లకోమారు నిర్వహించే జనగణన ప్రక్రియ చేపట్టాలంటే పెద్ద ఎత్తున అధికారులు ప్రమేయం అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడమంటే వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమేనని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ప్రాథమ్య అంశాల్లో జన గణన, ఎన్పీఆర్ లేవని మరో అధికారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నమోదు ప్రక్రియగా గుర్తింపు పొందిన జన గణన, ఎన్పీఆర్ నమోదు కార్యక్రమంలో సుమారు 30 లక్షల మంది అధికారులు భాగస్వాములు అవ్వాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Venkaiah Naidu: ఆ రోజు నా కళ్లలో నీళ్లు తిరిగాయి: వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Lakshya Sen: స్వర్ణం సాధించిన లక్ష్యసేన్.. తుదిపోరులో విజయం
-
World News
Qantas: మేనేజర్లు, ఎగ్జిక్యూటీవ్‌లు.. బ్యాగేజ్ వద్ద పనిచేయండి..!
-
India News
Anand Mahindra: మీతో పాటు దేశం మొత్తం డ్యాన్స్ చేస్తోంది..!
-
Politics News
Telangana news: స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు: భట్టి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!