నడ్డా కేసులో ముగ్గురు ఐపీఎస్‌లకు నోటీసులు!

ముగ్గురు ఐపీఎస్‌లు డిప్యుటేషన్‌ మీద వెళ్లకపోవడంపై వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. సదరు అధికారులను డిప్యుటేషన్‌ మీద పంపించకపోవడంపై బెంగాల్‌ ప్రభుత్వాన్ని సైతం వివరణ కోరనుంది....

Published : 15 Dec 2020 22:33 IST

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనంపై రాళ్ల దాడి కేసులో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. భద్రతా లోపాల కారణంగానే భాజపా అధ్యక్షుడిపై దాడి జరిగిందని కేంద్రం వెల్లడించింది. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రంలోకి రావాలంటూ హోంశాఖ గతంలోనే సమన్లు జారీ చేసింది. అయితే ఆ ముగ్గురు ఐపీఎస్‌లు డిప్యుటేషన్‌ మీద వెళ్లకపోవడంపై వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. సదరు అధికారులను డిప్యుటేషన్‌ మీద పంపించకపోవడంపై బెంగాల్‌ ప్రభుత్వాన్ని సైతం వివరణ కోరనుంది.

పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన జేపీ నడ్డాపై ఈనెల 10వ తేదీన కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా ఆరోపించింది. ఈ ఘటనపై ఆగ్రహించిన కేంద్రం బెంగాల్‌ డీజీపీతోపాటు చీఫ్‌ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. బెంగాల్‌ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ, ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ, దక్షిణ బెంగాల్‌ అదనపు డీజీలపై చర్యలకు ఉపక్రమించింది.

ఇవీ చదవండి...

జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బెంగాల్‌ పోలీసుఅధికారులపై కేంద్రం కొరడా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని