శ్రీనగర్‌ సెక్టార్‌ CRPF ఐజీగా చారు సిన్హా!

జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్‌ సెక్టార్‌ సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా మహిళా ఐపీఎస్‌ అధికారిని చారు సిన్హా నియమితులయ్యారు.

Published : 01 Sep 2020 22:42 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్‌ సెక్టార్‌ సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా మహిళా ఐపీఎస్‌ అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. తొలిసారిగా ఓ మహిళా అధికారి ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉన్న శ్రీనగర్‌ సెక్టార్ ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన చారు సిన్హా 1996కు బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి. అయితే, కీలక ప్రాంతంలో బాధ్యతలు చేపట్టడం చారు సిన్హాకు మాత్రం కొత్తేమి కాదు. ఇదివరకు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. ఆమె ఆధ్వర్యంలో పలు నక్సల్స్‌ ఏరివేత ఆపరేషన్లు చేపట్టారు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ జమ్మూ విభాగంలో ఐజీగా చారు సిన్హా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా శ్రీనగర్‌ సెక్టార్‌ ఐజీగా ఆమె బదిలీ అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని