దైవదూత సమాధానం చెప్తారా?: చిదంబరం

గురువారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ‘దైవ ఘటన’ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఎద్దేవా చేశారు.

Updated : 29 Aug 2020 14:56 IST

సీతారామన్‌కు కాంగ్రెస్‌ నేత కౌంటర్‌

దిల్లీ: గురువారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ‘దైవ ఘటన’ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. ఆమెను ‘దైవదూత’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్‌ ప్రభావం చూపిందని, ఆ చట్టం ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా..2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందని ఆమె ఆ సమావేశంలో వెల్లడించారు. 

దానిపై చిదంబరం ట్వీట్‌ చేస్తూ.. ‘కరోనా మహమ్మారి ‘దైవ ఘటన’ అయితే.. మహమ్మారి దాడి చేయకముందు 2017-18, 2018-19, 2019-20లో ఆర్థికవ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోవడాన్ని ఎలా వివరిస్తారు? దైవదూతగా ఆర్థిక మంత్రి దానికి సమాధానం ఇవ్వగలరా?’ అంటూ విమర్శలు చేశారు. అలాగే 2018-19 రెండో త్రైమాసికంలో 7.1శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2019-20 నాలుగో త్రైమాసికంలో 3.1 శాతానికి క్షీణించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే రాష్ట్రాలకు ఇచ్చిన రెండు ఆప్షన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ వరస ట్వీట్లు చేశారు.  

ఇవీ చదవండి:

జీఎస్టీ ఆదాయం లోటు..రాష్ట్రాలకు 2 ఆప్షన్లు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని