30 ఏళ్ల తర్వాత.. చైనాకు మన బియ్యం!

భారత్‌ నుంచి బియ్యం కొనుగోలుకు చైనా ముందుకొచ్చింది. లద్దాఖ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి బియ్యం దిగుమతులను చైనా ప్రారంభించిందని ..........

Published : 02 Dec 2020 16:28 IST

దిల్లీ: భారత్‌ నుంచి బియ్యం కొనుగోలుకు చైనా ముందుకొచ్చింది. లద్దాఖ్‌ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి బియ్యం దిగుమతులను చైనా ప్రారంభించిందని బియ్యం మిల్లుల ప్రతినిధులు  వెల్లడించారు. అంతర్జాతీయం బియ్యం సరఫరాను కఠినతరం చేయడం, ధరల తగ్గింపు నేపథ్యంలో చైనా ముందుకొచ్చినట్టు తెలిపారు. బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద దేశం కాగా.. చైనా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఏడాదికి దాదాపు 4మిలియన్‌ టన్నుల బియ్యాన్ని డ్రాగన్‌ దిగుమతి చేసుకుంటుంది. అయితే,  నాణ్యతాపరమైన అంశాలను చూపుతూ గతంలో చైనా మన బియ్యం కొనుగోళ్లను నిలిపివేసింది. 

డ్రాగన్‌ కవ్వింపు చర్యలతో సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. డిసెంబర్‌ - ఫిబ్రవరి మధ్యస్థ రకం బియ్యాన్ని లక్ష టన్నుల ఎగుమతులకు వర్తకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో టన్నుకు 300 డాలర్ల చొప్పున కొనుగోలుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం. అయితే, భారత్‌లో పంటల నాణ్యతను చూసి వచ్చే ఏడాది ఈ కొనుగోళ్లను చైనా పెంచే అవకాశం ఉందని  బియ్యం ఎగుమతుదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు.

మరోవైపు, చైనాకు బియ్యం సరఫరా చేసే సంప్రదాయ దేశాలైన థాయిలాండ్‌, వియత్నాం, మయన్మార్‌, పాకిస్థాన్‌లలో బియ్యం నిల్వలు పరిమితంగా ఉండటం, భారత్‌తో పోలిస్తే టన్ను బియ్యానికి కనీసం 30 డాలర్లు అధికంగా కోట్‌ చేశాయని వాణిజ్య అధికారులు పేర్కొంటున్నారు. భారత్‌ నుంచి ధర తక్కువగా ఉండటంతో చైనా మన దేశం బియ్యంపై దృష్టి సారించిందని తెలుస్తోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని