అవును.. కిమ్‌ టీకా వేయించుకున్నారు..!

కిమ్‌ వైపు కరోనా కన్నెత్తి కూడా చూడదు.. ఎందకంటే ఇప్పుడు ఆయన టీకా వేయించుకున్నారు. అవును..కిమ్‌ సహా ఆయన కుటుంబీకులు, కీలకమైన అధికారులు కరోనా టీకా వేయించుకొన్నారని వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఇంట్రెస్ట్‌ అనే సంస్థలోని హారీ కజియానిస్‌ పేర్కొన్నారు.

Updated : 01 Dec 2020 11:47 IST

 ఉత్తరకొరియా పాలకుడి కుటుంబానికి చైనా సాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: కిమ్‌ వైపు కరోనా కన్నెత్తి కూడా చూడదు.. ఎందకంటే ఇప్పుడు ఆయన టీకా వేయించుకున్నారు. అవును..కిమ్‌ సహా ఆయన కుటుంబీకులు, కీలకమైన అధికారులు కరోనా టీకా వేయించుకొన్నారని వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఇంట్రెస్ట్‌ అనే సంస్థలోని హారీ కజియానిస్‌ పేర్కొన్నారు. ఆయన ఉత్తరకొరియా వ్యవహారాలపై పరిశోధనలు చేస్తుంటారు. చైనాలో అభివృద్ధి చేస్తున్న టీకాల్లో కచ్చితంగా కిమ్‌ ఏది వాడారో మాత్రం వెల్లడించలేదు. చైనాలోని ఏ టీకాకు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాలేదు.

ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా రాలేదని అక్కడి అధికారులు చెప్పడాన్ని అమెరికా నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. అక్కడి ప్రజలు చైనీయులతో నేరుగా వ్యాపారాలు నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా అక్కడికి  రాకుండా ఉండే అవకాశాలు దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. 

టీకా దొంగతనానికి యత్నం.. 

ఉత్తరకొరియా హ్యాకింగ్‌ ముఠాలు కొన్నాళ్ల క్రితం టీకా సమాచారం దొంగిలించేందుకు పలు పరిశోధన శాలలపై సైబర్‌ దాడులు చేశాయని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఏ కంపెనీలపై దాడులు చేసిందో మాత్రం వెల్లడించలేదు. కొన్నాళ్ల క్రితం ఆస్ట్రాజెనెకాపై సైబర్‌ దాడి జరిగినట్లు మాత్రం ఓ ఆంగ్ల వార్త సంస్థ తన కథనంలో పేర్కొంది.

ఇదీ చదవండి

కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

‘చైనా ఎల్లో డస్ట్‌’తో..వణుకుతున్న ఉ.కొరియా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని