US రహస్యాలు దోచేస్తున్న చైనా!

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఘర్షణకు దిగుతోందని...

Published : 05 Dec 2020 01:36 IST

అమెరికా టాప్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఆరోపణ

వాషింగ్టన్‌: స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాన్‌ ర్యాట్‌క్లిఫ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఘర్షణకు దిగుతోందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం రహస్యాలను దొంగిలించి ఎదగాలని, మార్కెట్లో యూఎస్‌ సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రాసిన వ్యాసంలో వెల్లడించారు.

అమెరికా మేధో హక్కులను దొంగిలించడంతోనే ట్రంప్‌ సర్కారు చైనా వస్తువులు, ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు, టారిఫ్‌లు విధించిందని ర్యాట్‌క్లిఫ్‌ అన్నారు. ‘అమెరికానే కాదు ప్రపంచం మొత్తం మీద ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగానే అనేక చైనా కంపెనీలు పనిచేస్తాయి. అందులో పనిచేసే కార్మికులను అడ్డుగా పెట్టుకొని డ్రాగన్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకొనేలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన ఆరోపించారు. త్వరలో గద్దెనక్కనున్న బైడెన్‌ ప్రభుత్వాన్ని ప్రభావం చేసేందుకు డ్రాగన్‌దేశం ఆసియాపై సైనికదాడికి దిగే అవకాశముందని హెచ్చరించారు.

‘అమెరికాతో బహిరంగ ఘర్షణకు దిగాలని చైనా అనుకుంటోంది. ఇందుకు వాషింగ్టన్‌ సిద్ధంగా ఉండాలి. నాయకులు విడిపోకుండా ఐక్యతతో ముప్పును గ్రహించాలి. దాని గురించి మాట్లాడాలి. పరిష్కారానికి సిద్ధంగా ఉండాలి’ అని ర్యాట్‌క్లిప్‌ రాశారు. కాగా ఆయన వ్యాఖ్యలను చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ విభేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని