సైనిక ఘర్షణకు కాలు దువ్వుతున్న చైనా!

ఇప్పటికే తన దురుసు వైఖరితో భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. తాజాగా తన అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వేదికగా కయ్యానికి కాలు దువ్వుతోంది. పత్రిక సంపాదకీయంలో హెచ్చరికలు చేస్తూ భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది..........

Published : 08 Sep 2020 11:41 IST

అధికార మీడియా సంస్థ ద్వారా భారత్‌ను హెచ్చరించే దుస్సాహసం

బీజింగ్‌: ఇప్పటికే తన దురుసు వైఖరితో భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. తాజాగా తన అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వేదికగా కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ఆ పత్రిక సంపాదకీయం వెలువరించింది. భారత్‌తో తాము ఏమాత్రం యుద్ధం కోరుకోవడం లేదంటూ.. తన వైఖరితో పొంతన లేని వ్యాఖ్యలు చేసింది. చైనా మంచితనాన్ని అడ్డంగా పెట్టుకొని ‘హెచ్చరిక కాల్పులకు’ పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక చేసింది. సరిహద్దుల్లో భారత సైనికులు హద్దులు మీరుతున్నారంటూ.. చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించునేందుకు చైనా ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చింది. అయినా, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా సైన్యం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో చైనా చేసే పనుల్ని భారత్‌పైకి తోసే ప్రయత్నం చేసింది.

సరిహద్దుల్లో భారత బలగాలు వాస్తవాధీన రేఖ దాటాయంటూ గ్లోబల్‌ టైమ్స్‌ దుష్ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే. డ్రాగన్‌ సైనికులపై హెచ్చరిక కాల్పులకు పాల్పడిందంటూ అవాస్తవాలు ప్రచారం చేసింది. భారత్‌ చర్యలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ఉన్నాయని వితండవాదం చేసింది. చైనా వాదనను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేసింది. భారత సైనికులెవరూ అతిక్రమణకు పాల్పడలేదని వివరించింది. చైనా ముందు నుంచి అనుసరిస్తున్న దురుసు వైఖరిని మానుకోవాలని సూచించింది. గత రాత్రి చైనాయే కాల్పులకు పాల్పడిందని.. అయినా భారత సైన్యం ఎంతో నేర్పుతో సహనం వహించాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని