
భారత్‌లో మరో చైనా వైరస్..!
జాతీయ సంస్థ ఐసీఎంఆర్ హెచ్చరిక
దిల్లీ: ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో.. మరో చైనా వైరస్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన ‘కేట్ క్యూ వైరస్’ అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ, పుణె విభాగం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిపిన నమూనా పరీక్షల్లో ఈ వైరస్ ఉనికి కనిపించనప్పటికీ.. ప్రతి 883 మందిలో ఇద్దరికి ఈ వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. వైరస్ దాడి చేసినపుడు దానిని ఎదుర్కొనేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీలను తయారు చేసుకుంటుందనే సంగతి తెలిసిందే.
దేశంలోని క్యులెక్స్ దోమలు, పందులలో ఈ వైరస్ ఉన్నట్టు ఉన్నట్టు వైరాలజీ విభాగం నిర్ధారించింది. దోమల నుంచి ఇంటిలో పెరిగే పందులకు సోకినట్టు తమ పరిశోధనల్లో తెలిసిందని శాస్త్రవేత్తలు వివరించారు. అంతేకాకుండా దోమల ద్వారా మనుషుల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశముందని మన దేశంలో క్యూలెక్స్ దోమలు అధికంగా ఉండటం వల్ల, ఈ వ్యాధి మనుషుల్లోనూ వ్యాప్తించేందుకు అధిక అవకాశముందని సంస్థకు చెందిన శాస్త్రవేత్త హెచ్చరించారు.
కాగా చైనాలోని దోమలు, వియాత్నాంలో పందుల్లో ఇప్పటికే కేట్ క్యూ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. అయితే దేశంలో దీని వ్యాప్తిని గురించి మరింతగా తెలిసుకునేందుకు మనుషులు, పందుల నమూనాలను విస్తృతంగా పరీక్షించాలని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.