డ్రాగన్‌ పరిశోధనకు దీటైన జవాబు

కొవిడ్‌-19 మూలాలు భారత్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయన్న చైనా పరిశోధన అత్యంత లోపభూయిష్టమని భారత్‌ ఖండించింది.

Published : 03 Dec 2020 00:03 IST

కరోనా ఎక్కడ పుట్టిందో ప్రపంచమంతటికీ తెలుసు..:సీఎస్‌ఐఆర్

దిల్లీ: మహమ్మారి కొవిడ్‌-19 మూలాలు భారత్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయంటోన్న చైనా పరిశోధన అత్యంత లోపభూయిష్టమని భారత్‌ ఖండించింది. పేలవంగా సాగిన ఈ పరిశోధన, శాస్త్రీయ సమీక్షకు నిలువలేదని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ ముండే స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు మూలం భారత్‌ అంటున్న ఈ పరిశోధన వివరాలను తాను చదివానని.. ఆ విశ్లేషణ అత్యంత ఘోరంగా ఉందన్నారు. లాన్సెట్‌లో ప్రచురించిన ఈ పరిశోధనను సమగ్రంగా సమీక్షించనే లేదని ఆయన ఎత్తిచూపారు.

భారత్‌లో మనుషులు, కోతుల సాహచర్యం అధికమన్న చైనా ఆరోపణకు కొవిడ్‌ వైరస్‌కు ఏ సంబంధం లేదని డాక్టర్‌ ముండే స్పష్టం చేశారు. ఇందుకు వారు చూపిన ఆధారాలు, అనుసరించిన విధానాలు శాస్తప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. విస్తృత పరిధిలో కాకుండా.. పరిమిత గణాంకాల ఆధారంగా సాగిన ఈ పరిశోధన మొత్తం అవకతవకలే అని రుజువవుతోందని శాస్త్రవేత్త అన్నారు.

కొవిడ్‌ మహమ్మారి మూలం చైనాలోని వుహాన్‌ అని ప్రపంచం ఆమోదించిందని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్‌ జనరల్‌ అన్నారు. భారత్‌ కూడా దాన్నే నమ్ముతోందని ఆయన స్పష్టం చేశారు. నిజం ఏమిటనేది కళ్లకు కట్టినట్టు తెలుస్తుండగా.. రాజకీయం చేయాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని