దిల్లీలో సామాజిక వ్యాప్తి దశలో కరోనా!

దేశ రాజధానిలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని భావిస్తున్నట్లు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ అభిప్రాయపడ్డారు. అయితే దాని గురించి కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌ ) మాత్రమే నిర్దారించగలవని అన్నారు.

Published : 19 Sep 2020 19:38 IST

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని భావిస్తున్నట్లు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ అభిప్రాయపడ్డారు. అయితే దానిని కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌ ) మాత్రమే నిర్ధరించగలవని అన్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడుతున్నారంటే.. అక్కడ సామాజిక వ్యాప్తి జరుగుతోందని మనం అంగీకరించాలి. కానీ అది సాంకేతికతకు సంబంధించిన విషయం కాబట్టి.. కేంద్రం లేదా ఐసీఎంఆర్‌ మాత్రమే దానిని నిర్ధరించగలవు. గత 40 రోజుల్లో దిల్లీలో కేసులు రెండు రెట్లు పెరిగాయి’ అని తెలిపారు.

గత 24 గంటల్లో దిల్లీలో కరోనా వైరస్‌ కేసులు 4వేలకు పైగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38వేలకు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దిల్లీలో మొత్తం వైరస్‌ బారిన పడి 4,907 మంది మృతి చెందారు. కాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 93వేల కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్త కేసుల సంఖ్య 53లక్షలకు చేరుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని