బెంగాల్‌లో ఆ 3 రోజులు పూర్తి లాక్‌డౌన్‌

బెంగాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ అక్కడ నమోదవుతున్న......

Published : 21 Jul 2020 23:41 IST

కోల్‌కతా: బెంగాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ అక్కడ నమోదవుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా మంగళవారం 2261 కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కట్టడికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని దీదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా బెంగాల్‌లో ఈ నెల 23, 25, 29 తేదీల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,030కి చేరగా.. 1182 మంది ప్రాణాలు కోల్పోయారు.

లాక్‌డౌన్‌ అమలు సమయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు, ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోనున్నాయి. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు.  నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని