భారత్‌లో మూడో దశ ట్రయల్స్‌కు ఓ వ్యాక్సిన్‌!

కరోనా వైరస విజృంభణతో భయం గుప్పిట్లో బతుకుతున్న జనం ఆశలన్నీ వ్యాక్సిన్ ‌పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు సంబంధించి నీతి ఆయోగ్‌ ఓ శుభవార్త చెప్పింది. ......

Published : 18 Aug 2020 18:41 IST

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో భయం గుప్పిట్లో బతుకుతున్న జనం ఆశలన్నీ వ్యాక్సిన్ ‌పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు సంబంధించి నీతి ఆయోగ్‌ ఓ శుభవార్త చెప్పింది. దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పగా.. వీటిలో ఓ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌కి సిద్ధమైనట్టు నీతి ఆయోగ్‌ ప్రతినిధి వీకే పాల్‌ వెల్లడించారు. నేడో, రేపే మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. మిగిలిన రెండు వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నట్టు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జైడస్‌ క్యాడిలాతో పాటు పలు సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దేశంలో మూడు కోట్ల మందికి పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తెలిపారు. గడిచిన 24గంటల్లోనే 8,99,864మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడినవారిలో 19.70లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసులు కేవలం పావు వంతు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం సగటున రోజుకు రికవరీ అవుతున్న వారి సంఖ్య 55వేలకు పైనేనని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దేశంలో మరణాల రేటు 2శాతం కంటే తక్కువగానే ఉందన్నారు.  ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు  73.18% కాగా.. యాక్టివ్‌ కేసులు 24.91%, మరణాల రేటు 1.92%గా ఉన్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని