కరోనా కేసులు దిల్లీలో సరికొత్త రికార్డు!

దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించినా కొంతకాలంగా నమోదవుతున్న కేసులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి...........

Published : 16 Sep 2020 22:16 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించినా కొంతకాలంగా నమోదవుతున్న కేసులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 4473 కొత్త కేసులు, 33 మరణాలు నమోదుకావడం కలవరపెడుతోంది. ఇప్పటివరకు దిల్లీలో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. తాజాగా 62,593 శాంపిల్స్‌ పరీక్షించగా.. 4473 మందికి పాజిటివ్‌గా తేలింది. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటిదాకా 23,09,578 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,30,269మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 1,92,516 మంది కోలుకోగా.. 4,839 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 30,914 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దిల్లీలో రికవరీ రేటు 85 శాతానికి పైగా ఉండగా.. మరణాల రేటు 2.1శాతంగా ఉంది. దిల్లీలో కేసులతో పాటు కంటైన్‌మెంట్‌ జోన్లు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం 1560 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా.. బుధవారానికి అవి 1637కి పెరిగాయి. నగరంలోని పలు ఆస్పత్రుల్లో 14,521 పడకలకు గాను, 6783 పడకలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని