సింగపూర్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌

సింగపూర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. 46 ఏళ్ల సారా లిమ్‌ అనే నర్సు తొలి టీకాను అందుకున్నారు. ఆసియాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తొలిదేశాల్లో సింగపూర్‌ ఒకటి కాగా.............

Published : 30 Dec 2020 11:26 IST

సింగపూర్‌: సింగపూర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. 46 ఏళ్ల సారా లిమ్‌ అనే నర్సు తొలి టీకాను అందుకున్నారు. ఆసియాలో ఫైజర్‌ టీకాతో వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టిన తొలిదేశాల్లో సింగపూర్‌ ఒకటి కాగా.. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే మొదటిది కావడం విశేషం.

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతించిన తొలి ఆసియా దేశం సింగపూరే. డిసెంబరు 14న అనుమతులు రాగా.. 21వ తేదీన ఆ దేశానికి టీకా డోసులు చేరాయి. అప్పటికే నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. నేటి నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. తొలుత హెల్త్‌కేర్‌ వర్కర్లకు ఇవ్వడం మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో మరింత మంది వైద్యారోగ్య సిబ్బందికి, ఆ తర్వాత 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

సింగపూర్‌ వాసులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆర్డర్‌ చేసిన ప్రకారం టీకా డోసులు సమయానికి చేరితే 2021 ఏడాది చివరి నాటికి సింగపూర్‌లో సూదీర్ఘ కాలంగా ఉంటున్నవారందరికీ వ్యాక్సిన్‌ అందజేయగలుగుతామని ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్‌లో ఇప్పటి వరకు 58,725 మందికి వైరస్‌ సోకింది. వీరిలో ఇప్పటికే 58,400 మంది కోలుకున్నారు. మరో 29 మంది మరణించారు. కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో సింగపూర్‌ ఒకటి కావడం గమనార్హం.

ఇవీ చదవండి..

విశ్వవ్యాప్తంగా ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!

దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని