భారత్‌లో నేడు ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతి?

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టీకాకు అనుమతులు మంజూరు చేసే అంశంపై నిపుణుల

Published : 30 Dec 2020 14:58 IST

దిల్లీ: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టీకాకు అనుమతులు మంజూరు చేసే అంశంపై నిపుణుల కమిటీ నేడు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరమ్‌ సంస్థ చేసిన దరఖాస్తును పరిశీలించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రాజెనెకా టీకాకు యూకేలో అనుమతి లభించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ పేరుతో టీకాను తయారుచేస్తోంది.

కాగా.. భారత్‌లో అత్యవసర అనుమతుల కోసం ఇప్పటివరకు సీరంతో పాటు భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. కాగా.. ప్రయోగాల విషయమై అదనపు సమాచారం కావాలని నిపుణుల కమిటీ ఈ సంస్థలను కోరింది. అయితే ఆ వివరాలను సీరమ్‌ అందించగా.. ఫైజర్‌ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో ఫైజర్ దరఖాస్తును నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌కే తొలి అనుమతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బ్రిటన్‌లోనూ ఈ టీకాను ఆమోదం లభించిన నేపథ్యంలో భారత్‌లో అనుమతులకు మార్గం మరింత సుగమమైనట్లు తెలుస్తోంది. 

కాగా.. టీకా అనుమతులపై సీరమ్‌ సానుకూలంగా ఉంది. అటు పంపిణీకి కూడా సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచినట్లు ఆ కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. 

ఇవీ చదవండి..

ఆక్స్‌ఫర్డ్‌ టీకా: 5 కోట్ల డోసులు సిద్ధం!

ఆస్ట్రాజెనెకా టీకాకు యూకే అనుమతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని