గోసంరక్షణకు మంత్రివర్గ సమావేశం

ఆవుల సంరక్షణ, పాడి అభివృద్ధి కోసం ఆదివారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తొలిసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.  సీఎం తన నివాసం నుంచి వర్చవల్‌ మోడ్‌(వీడియో కాల్) పద్ధతిలో ఈ సమావేశానికి హాజరయ్యారు.‘గోపాష్టమి’సందర్భంగా  సమావేశం నిర్వహించి భగవంతుడు శ్రీకృష్టుడు, గోమాతకు అంకితమిచ్చారు.

Updated : 22 Nov 2020 19:47 IST

భోపాల్‌: ఆవుల సంరక్షణ, పాడి అభివృద్ధి కోసం ఆదివారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  సీఎం తన నివాసం నుంచి వర్చువల్‌ మోడ్‌(వీడియో కాల్) పద్ధతిలో ఈ సమావేశానికి హాజరయ్యారు.‘గోపాష్టమి’సందర్భంగా  సమావేశం నిర్వహించి భగవంతుడు శ్రీకృష్టుడు, గోమాతకు అంకితమిచ్చారు.  గోవుల సంరక్షణతో రాష్ట్ర్రానికి ఆర్థిక స్వావలంబన చేకూరడమే ప్రధాన ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి  వివరించారు.  గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం శివరాజ్‌ సింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.. పశుసంవర్ధక, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గృహ, వ్యవసాయ సంక్షేమ శాఖలు  గో సంరక్షణ మంత్రివర్గం కిందికి వస్తాయని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని