టర్కీ భూకంపం.. 114కు చేరిన మృతుల సంఖ్య

టర్కీలో ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 114కు చేరినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 1035 మంది గాయాల పాలైనట్లు వివరించింది. 137 మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు రాతపూర్వకంగా తెలిపింది. భూకంపం వల్ల టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరం

Published : 04 Nov 2020 19:04 IST

పూర్తైన సహాయక చర్యలు

ఇజ్మిర్‌ : టర్కీలో ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 114కు చేరినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 1035 మంది గాయాల పాలైనట్లు వివరించింది. 137 మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు రాతపూర్వకంగా తెలిపింది. భూకంపం వల్ల టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరం ఇజ్మీర్‌లో 17 భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుక్కున్న 107 మందిని కాపాడినట్లు.. సహాయక చర్యలు పూర్తైనట్లు ఆ దేశ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ప్రతినిధి ట్విటర్‌ వేదికగా వివరించారు.   

ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ఇజ్మిర్‌ నగర మేయర్‌ సోయెర్‌ ‘వన్‌ రెంట్‌ వన్‌ హోమ్‌’ పేరుతో ప్రచారం ప్రారంభించారు. దీనికి ఆ దేశ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన ఐదు గంటల సమయంలోనే 20 మిలియన్ల టర్కిష్‌ లిరా (దాదాపు రూ.1,75,00,000) సాయం అందినట్లు మేయర్‌ వివరించారు. ఈ సాయంతో 200 కుటుంబాలకు టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 8 వేల తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఏజియన్‌ సముద్రంలో రిక్టర్‌స్కేలుపై 6.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం వల్ల టర్కీ, గ్రీస్‌ దేశాల్లోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. 

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని