‘మహా’ కరోనా: 24 గంటల్లో 260 మంది మృతి

మహారాష్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 9,509 కొత్త కేసులు నమోదుకాగా, గడచిన 24 గంటల్లో 260 మరణాలు సంభవించాయి. ఇవాళ ఒక్క రోజే...

Updated : 02 Aug 2020 20:59 IST

కర్ణాటక, తమిళనాడులోనూ కొనసాగుతున్న కరోనా ఉగ్రరూపం

దిల్లీ: మహారాష్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 9,509 కొత్త కేసులు నమోదుకాగా, గడచిన 24 గంటల్లో 260 మరణాలు సంభవించాయి. ఇవాళ ఒక్క రోజే 9926 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,76,809 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,228కి, మరణాల సంఖ్య15,576కి చేరుకుంది. ఇక ధారావిలో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 80 కేసులు క్రియాశీలకంగా ఉన్నట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్ తెలిపింది. దీంతో మొత్తం ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 2,573కి చేరింది.

* దేశ రాజధాని దిల్లీలో 961 కొత్త కేసులు బయటపడ్డాయి. 1186 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అలానే 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,37,677కి చేరుకుంది. రికవరీ అయిన వారి సంఖ్య 1,23,317కి చేరుకోగా, 4004 మరణాలు చోటుచేసుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

*కర్ణాటకలో కొత్తగా 5,532కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 84 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,34,819కి, మరణాల సంఖ్య 2,496కి చేరింది. ప్రస్తుతం 74,590 మంది క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

*కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 5,785 కొత్త కేసులు వెలుగుచూశాయి. 98 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,613కి పెరిగింది. మరణాల సంఖ్య 4,132గా నమోదైంది. ఇప్పటి వరకు 1,96,483 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడచిన 24 గంటల్లో 60,334 నమూనాలను పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుడటంతో చెన్నైలో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని