ఐదో రోజూ 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత

దేశ రాజధానిలో వరుసగా  అయిదో రోజు కూడా ఉష్ణోగ్రత 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో శనివారం అత్యల్పంగా  4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన పొగ మంచు పెరిగిపోవడంతో సాధారణం కన్నా మూడు రెట్లు చలి పెరిగిందని శాఖ వివరించింది...

Updated : 26 Dec 2020 22:51 IST

దిల్లీ: దేశ రాజధానిలో వరుసగా  అయిదో రోజు కూడా ఉష్ణోగ్రత 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో శనివారం అత్యల్పంగా  4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన పొగ మంచు పెరిగిపోవడంతో సాధారణం కన్నా మూడు రెట్లు చలి పెరిగిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  దట్టమైన పొగమంచు ఆవరించడంతో సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో 1000 మీటర్లు, పాలంలో 800 మీటర్ల దూరం నుంచి వచ్చే వాహనాలు కనిపించడంలేదని వాహనదారులు చెబుతున్నారు. 

  ఈ మేరకు ఐఎండీ ఛైర్మన్‌ కె. శ్రీవాస్తవ శనివారం వాతావరణ శాఖ వివరాలు వెల్లడించారు.  ఆదివారం, సోమవారం పశ్చిమం నుంచి వీచే గాలుల వల్ల పొగమంచు కాస్త  తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని  ఆయన చెప్పారు.  ఈ సీజన్‌లో సాధారణంగా హిమాలయాల నుంచి వచ్చే మంచు ఎక్కువగా ఉంటుందన్నారు.  ప్రస్తుతం దిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని