దిల్లీ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ సస్పెన్షన్‌

దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి యోగేశ్‌ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై జారీ చేసినట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. గత వారంలో వర్సిటీలో రెండు నియామకాల అంశం వివాదాస్పదం........

Published : 29 Oct 2020 01:44 IST

దిల్లీ: దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి యోగేశ్‌ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. గత వారంలో వర్సిటీలో రెండు నియామకాల అంశం వివాదాస్పదం కావడంతో ఆయనపై విచారణకు అవకాశమివ్వాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రపతిని కోరింది. దీంతో మంగళవారం రాత్రి వీసీ యోగేశ్‌ త్యాగిపై విచారణకు కోవింద్‌ అనుమతిచ్చారు. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్‌ చేసినట్టు కేంద్ర విద్యాశాఖ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో తెలిపింది. పదవిలో ఉంటే ఆయన విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. యోగేశ్‌ త్యాగి తిరిగి బాధ్యతలు చేపట్టేదాకా ప్రస్తుత వీసీగా ప్రొఫెసర్‌ పీసీ జోషీ కొనసాగుతారని స్పష్టంచేసింది.

అనారోగ్య కారణాలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన త్యాగి జులై 2నుంచి సెలవులో ఉన్నారు. అయితే, జులై 17న కేంద్రం ప్రొఫెసర్‌ పీసీ జోషీని ఇంఛార్జి వీసీగా నియమించింది. ఈ క్రమంలో పీసీ జోషీని తొలగించిన త్యాగి.. వీసీ బాధ్యతల్లో గీతా భట్‌ను తాత్కాలికంగా నియమించడంతో వివాదం మొదలైంది. అలాగే, పీసీ ఝాను యాక్టింగ్‌ రిజిస్ట్రార్‌గా, సౌత్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌గా నియమకానికి ఆమోదించారు. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర విద్యాశాఖ సెలవులో ఉన్న త్యాగి ఆదేశాలు చెల్లవని పేర్కొంటూ ఈ నియామకాలపై విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని