ఆ 36 మంది విదేశీయులు నిర్దోషులే..

కొవిడ్‌ మార్గదర్శకాలు, వీసా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 మందిని దిల్లీ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. 14 దేశాలకు చెందిన 36 మందిని విదేశీయులను నిర్దోషులుగా ప్రకటిస్తూ...

Published : 16 Dec 2020 23:53 IST

తీర్పు వెల్లడించిన దిల్లీ కోర్టు

దిల్లీ: దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించి ప్రజలు భయాందోళనలకు గురవుతున్న వేళ దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం చర్చనీయాంశమైంది. కేంద్రం జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శకాలు, వీసా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆగస్టు 24న పలువురిపై చార్జ్‌షీట్‌ దాఖలైంది. సెక్షన్‌ 269 (ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణ పట్ల నిర్లక్ష్యం)తోపాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదయ్యాయి. కాగా ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 మందిని దిల్లీ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. 14 దేశాలకు చెందిన 36 మంది విదేశీయులను నిర్దోషులుగా ప్రకటిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ గార్గ్ మంగళవారం తీర్పు వెల్లడించారు.

దిల్లీలోని నిజాముద్దీన్‌లో ఈ ఏడాది మార్చిలో తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం జరిగింది. అయితే కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన కార్యక్రమం నిర్వహించారని, వీసా నిబంధనలు ఉల్లంఘించారని పలువురు తబ్లిగీ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. తాజాగా ఆ తబ్లిగీలను దిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఇవీ చదవండి...

అత్తింట్లో మహిళా హక్కుల నిరాకరణ తగదు: సుప్రీం

అత్యాచార దోషులకు వంధ్యత్వ శిక్ష
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని