Published : 18 Nov 2020 15:51 IST

ఇక వివాహ వేడుకలకు 50 మంది మాత్రమే

కుదించిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు దిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు 50 మంది మాత్రమే హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో 200గా ఉన్న సంఖ్యను 50కి కుదించింది. దిల్లీలో కరోనా పరిస్థితిపై మంగళవారం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయనున్నామని, పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు పంపగా.. బుధవారం ఆయన ఆమోద ముద్ర వేశారు.

అలాగే, లాక్‌డౌన్ విధిస్తారంటూ చక్కర్లు కొడుతున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్‌ తోసిపుచ్చారు. ‘దుకాణదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ వ్యాపారాలు తెరిచే ఉంటాయని భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని నిబంధనలను మాత్రం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అది లాక్‌డౌన్ ఏ మాత్రం కాదు’ అంటూ సిసోడియా హామీ ఇచ్చారు. మంగళవారం ఒక్కరోజే దిల్లీలో 6,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య సోమవారంతో పోల్చుకుంటే రెట్టింపుగా ఉండటం గమనార్హం. నిర్ధారణ పరీక్షల సంఖ్య 30వేల నుంచి 49,031కి పెరగడం అందుకు ఓ కారణంగా కనిపిస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts