వరల్డ్‌ బెస్ట్‌ సిటీస్‌: దిల్లీ ర్యాంకు ఎక్కడ?

ప్రపంచంలోని ఉత్తమ నగరాలు-2021 జాబితాలో భారతదేశ రాజధాని న్యూ దిల్లీ 62వ స్థానం దక్కించుకుంది. భారత్‌ నుంచి కేవలం ఈ ఒక్క నగరం మాత్రమే అందులో నిలవడం గమనార్హం. గత ఏడాది ఈ జాబితాలో దిల్లీ 81వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది అభివృద్ధి దిశగా అడుగులు వేసి 62కు చేరుకోవడం విశేషం....

Published : 22 Nov 2020 20:46 IST

న్యూ దిల్లీ: ప్రపంచంలోని ఉత్తమ నగరాలు-2021 జాబితాలో భారతదేశ రాజధాని న్యూదిల్లీ 62వ స్థానం దక్కించుకుంది. భారత్‌ నుంచి కేవలం ఈ ఒక్క నగరం మాత్రమే అందులో నిలవడం గమనార్హం. గత ఏడాది ఈ జాబితాలో దిల్లీ 81వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది అభివృద్ధి దిశగా అడుగులు వేసి 62కు చేరుకోవడం విశేషం.

డెస్టినేషన్‌ డెవలప్‌మెంట్‌, బ్రాండింగ్, మార్కెటింగ్, డిజైన్, టూరిజం, డేటా, ట్రావెల్ రిపోర్ట్స్‌ తదితర విషయాల్లో ప్రత్యేకతలు కలిగిన వాంకోవర్‌కు చెందిన రెసోనాన్స్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయించింది. నగరం ఖ్యాతి, పరిస్థితులు, పోటీతత్వం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని ప్రతిభావంతులు, సందర్శకులు, వ్యాపారవేత్తల అభిప్రాయల ఆధారంగా ఈ ర్యాంకును ప్రకటించారు. ప్రపంచంలోని మొత్తం నగరాల్లో ఉత్తమంగా ఉన్న 100 సిటీలకు ర్యాంకులు ఇచ్చారు.

ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కెజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘దిల్లీ వాసులకు ఇది శుభవార్త. దీన్ని సాధించడం కోసం గత ఆరేళ్లుగా ఇక్కడి ప్రజలు ఎంతో శ్రమించారు. దిల్లీలో పరిస్థితులు అనుకూలంగా మారాయనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది’ అని పేర్కొన్నారు.
ప్రపంచంలోని ఉత్తమ నగరాలు-2021 (టాప్‌ టెన్‌)

1. లండన్‌
2. న్యూయార్క్‌
3. ప్యారిస్‌
4. మాస్కో
5. టోక్యో
6. దుబాయ్‌
7. సింగపూర్
8. బార్సిలోనా
9. లాస్‌ ఏంజెల్స్‌
10. మాడ్రిడ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు