దిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు!

శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దిల్లీలో తొలిసారి 6,725 కేసులు నమోదయ్యాయి.

Published : 03 Nov 2020 23:13 IST

దిల్లీ: శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దిల్లీలో తొలిసారి 6,725 కేసులు నమోదయ్యాయి. మరో 48 మంది కరోనా కారణంగా మరణించారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటి వరకు దిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4లక్షల మార్కు దాటినట్లు పేర్కొంది. గతంలో అక్టోబర్‌ 30న అత్యధికంగా 5,891 కేసులు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు తెలిపిన ప్రకారం దిల్లీలో ప్రస్తుతం 3,452 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి 21వేల మంది రోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా తాజాగా దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ మాట్లాడుతూ.. శీతాకాలంలో ఒక రోజులో 14వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ ఇదివరకే చెప్పినట్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం సిద్ధమై ఉండాలని డాక్టర్‌ పాల్‌ కమిటీ సూచించినట్లు జైన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని