దిల్లీలో తొలిసారి భారీగా కరోనా కేసులు

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో పరీక్షలు చేయగా.. అదే తరహాలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే.........

Published : 09 Sep 2020 21:57 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో పరీక్షలు చేయగా.. అదే తరహాలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే 4039 కేసులు; 20 మరణాలు వచ్చినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నగరంలో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన వాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,01,176కి చేరింది. ఈ రోజు దిల్లీలో 54,517 శాంపిల్స్‌ను పరీక్షించారు.

గతంలో జూన్‌ 26న అత్యధికంగా 3,460 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇటీవలి కాలంలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దిల్లీలో ఇప్పటివరకు 4,638 మంది కొవిడ్‌తో మరణించారు. మరణాల రేటు ప్రస్తుతం 2.31శాతంగా ఉంది. కరోనా బారినపడినవారిలో తాజాగా మరో 2623మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 1,72,736కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 85.87శాతంగా ఉండగా.. క్రియాశీల కేసులు 23,773 ఉన్నాయి.  

దిల్లీలో భారీగా కొవిడ్‌ పరీక్షలు చేయడం వల్ల కేసులు పెరుగుతున్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. గతం వారం రోజులుగా 15వేలు నుంచి 20వేల వరకు శాంపిల్స్‌ పరీక్షించగా తాజాగా 54,517 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. కేసులు పెరిగినప్పటికీ మరణాల రేటు తక్కువగానే కొనసాగుతోందని తెలిపారు. భారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారానే రోగులను గుర్తించి వారిని ఐసోలేషన్‌లో ఉంచడం ద్వారా ఈ మహమ్మారిని కట్టడి చేయగలమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు