దిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశ రాజధాని నగరంపై కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మాయదారి మహమ్మారి మళ్లీ అక్కడ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా 24 గంటల్లోనే 5,600లకు పైగా కొత్త కేసులు....

Published : 28 Oct 2020 22:01 IST

తొలిసారి 5వేల మార్కు దాటాయ్‌!

దిల్లీ‌: దేశ రాజధాని నగరంపై కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మాయదారి మహమ్మారి మళ్లీ అక్కడ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా 24 గంటల్లోనే 5,600లకు పైగా కొత్త కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా ప్రవేశించిన తర్వాత దిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే 5వేల మార్కును దాటడం ఇదే ప్రథమం. గత కొన్ని రోజులుగా 4వేలకు పైగా కేసులు చొప్పున నమోదవుతున్నప్పటికీ బుధవారం 60,571 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,673 కొత్త కేసులు రావడం కలవరపెడుతోంది. 

దిల్లీలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,70,104కి చేరింది. మరో 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 6,396కి పెరిగినట్టు వైద్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. గతంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులను పరిశీలిస్తే.. నిన్న ఒక్కరోజే 4,853 కేసులు వచ్చాయి. మరోవైపు, దిల్లీలో రికవరీ రేటు కూడా భారీగానే ఉంది. దిల్లీలో ప్రస్తుతం 29,378 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts