Delta Variant: యాంటీబాడీలతో ‘డెల్టా’ పని పట్టొచ్చు.. టీకాతో ఈ వేరియంట్‌కు అడ్డుకట్ట

టీకా వేసుకుంటే ‘డెల్టా’ వేరియంట్‌ కూడా ఏమీ చేయలేదని ‘వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌

Published : 19 Aug 2021 10:00 IST

శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: టీకా వేసుకుంటే ‘డెల్టా’ వేరియంట్‌ కూడా ఏమీ చేయలేదని ‘వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై డెల్టా వేరియంట్‌ అంతగా ప్రభావం చూపకపోవడానికి కారణాలు కూడా వెల్లడయ్యాయి. డెల్టా నిరోధించడంలో యాంటీబాడీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని..వాటిని తప్పించుకొని వైరస్‌ ముందుకు వెళ్లలేకపోతోందని పేర్కొన్నారు. 13 యాంటీబాడీలను తీసుకొని వీరు ప్రయోగం చేశారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను ఈ యాంటీబాడీలపై ప్రయోగించారు. పదమూడింటిలో 12 యాంటీబాడీలు.. ఆల్ఫా, డెల్టాను గుర్తించి అడ్డుకున్నాయి. 8 కణాలు.. నాలుగు వేరియంట్లను విజయవంతంగా గుర్తించాయి. ఒకటి మాత్రం.. ఒక్క వేరియంట్‌నూ గుర్తించలేకపోయింది. ఈ అధ్యయనంతో వ్యాక్సిన్‌తో తయారయ్యే యాంటీబాడీలు, డెల్టాను సమర్థంగా ఎదుర్కొంటున్నాయన్న విషయం నిరూపితమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరి పరిశోధనను ‘ఇమ్యూనిటీ జర్నల్‌’ ప్రచురించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని