రాజ్యసభ సభ్యుడిగా దేవెగౌడ ప్రమాణస్వీకారం

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (87) ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా..

Published : 20 Sep 2020 16:48 IST

దిల్లీ: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (87) ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టారు. జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన దేవెగౌడ నేడు కన్నడలో ప్రమాణస్వీకారం చేశారు. 1996 నుంచి జనతాదళ్‌ (ఎస్‌‌) పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయిన మొదటివ్యక్తిగా మాజీ ప్రధాని నిలిచారు. ఆదివారం ఉదయం సమావేశం ప్రారంభమవ్వగానే సభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించగా మాజీ ప్రధాని మాతృభాషలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం స్పందించిన వెంకయ్యనాయుడు మాజీ ప్రధాని, సీనియర్‌ నేత రాకతో సభకు మరింత బలం చేకూరిందన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని