భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపిన Jr.ట్రంప్

అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన  ప్రపంచ మ్యాప్‌ వివాదాస్పదంగా మారింది.

Updated : 04 Nov 2020 13:10 IST

ఎన్నికల వేళ వివాదంలోకి జూనియర్..భారత్‌ నుంచి వ్యతిరేకత

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన  ప్రపంచ మ్యాప్‌ వివాదాస్పదంగా మారింది. అందులో కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై మనదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తన తండ్రి విజయం సాధిస్తారని ముందుగానే అంచనా వేసిన ట్రంప్‌ జూనియర్ రిపబ్లికన్‌ పార్టీని సూచించే ఎరుపు రంగుతో ఉన్న ప్రపంచ  మ్యాప్‌ను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. అందులో భారత్, మరికొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలు ఎరుపు రంగులోనే ఉన్నాయి. మనదేశం నీలం రంగులో కనిపించగా, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం రిపబ్లికన్ పార్టీవైపై అన్నట్లు ఆ మ్యాప్‌ వెల్లడిచేస్తోంది. అలాగే కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తూ, ట్రంప్‌ నుంచి నిత్యం విమర్శలకు గురైన చైనా కూడా నీలం రంగులోనే దర్శనమిచ్చింది. కాగా, వక్రీకరించిన ఈ మ్యాప్‌పై మనదేశ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన ఫలితం: కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతం మిగిలిన భారతావని నుంచి వేరుగా ఉన్నాయి’ అని ట్రంప్‌తో ప్రధాని మోదీ చేసిన స్నేహానికి ఫలితమిదని విమర్శించారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే తీరులో స్పందించారు. ‘సీనియర్ ట్రంప్‌తో మోదీ స్నేహం చేశారు. జోబైడెన్‌, కమలాహారిస్‌ వైపే భారత్ ఉందని గట్టిగా చెప్పిన జూనియర్‌ ట్రంప్‌..జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం మిగిలిన భారతీయుల్లాకాకుండా ట్రంప్‌కు ఓటేస్తారని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా ఆయన వద్ద ఉన్న రంగు పెన్సిళ్లను దూరంగా తీసుకెళ్లాలి’ అంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని