బుద్ధదేవ్‌ ఆరోగ్యం విషమం!

సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ను  కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు కరోనా నెగెటివ్‌గా తేలినట్టు ........

Published : 10 Dec 2020 01:23 IST

ఆస్పత్రికి వెళ్లిన బెంగాల్‌ గవర్నర్‌, సీఎం

కోల్‌కతా: సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ను  కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు కరోనా నెగెటివ్‌గా తేలినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని ఈ రోజు సాయంత్రం విడుదలచేసిన బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు.

రెండు పర్యాయాలు బెంగాల్‌ సీఎంగా పనిచేసిన బుద్ధదేవ్‌ వయస్సు ప్రస్తుతం 76 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా హృదయ సంబంధమైన, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి, వైద్య చికిత్సలను అందించేందుకు ఉడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి ఓ వైద్య కమిటీని ఏర్పాటు చేసింది.  అయితే, ఆయన్ను కలిసేందుకు మాత్రం ఎవరినీ అనుమతించడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా తెలిపారు. శ్రేయోభిలాషులు ఆస్పత్రి యాజమాన్యంతో సహకరించాలని కోరారు. 

ఆస్పత్రికి వెళ్లిన గవర్నర్‌, సీఎం
ఆయన ఆరోగ్య పరిస్థితిపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లిన దీదీ.. బుద్ధదేవ్‌ సతీమణి, కుమార్తెను కలిశారు. అలాగే, గవర్నర్‌ జగ్దీప్‌ ధన్కర్‌ కూడా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని