రైతు మోర్చాకు అనుమతుల్లేవు..

 కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతు సంఘాలు నవబంర్‌ 26,27న చేపట్టనున్న ‘రైతు మోర్చా’అభ్యర్థనను  బుధవారం పోలీసులు తిరస్కరించారు.  ‘రైతులు అనుమతి లేకుండా నగరంలోకి వచ్చి నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం...

Updated : 19 Sep 2022 11:09 IST

న్యూదిల్లీ:  కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతు సంఘాలు నవంబర్‌ 26, 27న చేపట్టనున్న ‘రైతు మోర్చా’అభ్యర్థనను  బుధవారం పోలీసులు తిరస్కరించారు.  ‘రైతులు అనుమతి లేకుండా నగరంలోకి వచ్చి నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  500 రైతు సంఘాలు నవంబర్‌ 26న నిర్వహించనున్న ‘ఛలో దిల్లీ’ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం.  నగరంలో ఎటువంటి సమావేశాలకు అనుమతులు లేవు.  నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని దిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలు రైతుల పంటకు కనీస మద్దతు ధరను నిర్వీర్యం చేస్తున్నాయని, దీనికి నిరసనగా  ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ), రాష్ట్ర్రీయ కిసాన్‌ మహాసంఘ్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌లు కలిసి దేశ రాజధానిలో కిసాన్‌ మోర్చా ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని