‘మమ్మల్ని విడగొట్టేందుకు కేంద్రం యత్నం’

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని .......

Updated : 12 Dec 2020 19:51 IST

ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు నేతల హెచ్చరిక 

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఎల్లుండి సింఘు సరిహద్దులో నిరాహార దీక్ష చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 19లోపు తమ డిమాండ్లు అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని, కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. రైతు సంఘాలను విడదీసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌ నుంచి రైతులు ట్రాక్టర్లతో రేపు ర్యాలీగా దిల్లీకి వస్తారని చెప్పారు.  అలాగే, ర్యాలీగా వచ్చి దిల్లీ- జైపుర్‌ రోడ్డును దిగ్బంధిస్తారన్నారు. 

మరోవైపు, హరియాణా రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలపై పలు రైతు నేతలతో చర్చిస్తున్నారు. రైతు సాధికారత కోసమే కేంద్రం కొత్త సాగు చట్టాలను తెచ్చినట్టు ఆయన వివరించారు. 

ఇదీ చదవండి..  రోడ్ల దిగ్బంధానికి కదం తొక్కిన రైతులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని