రైతన్నలు వారి నుంచి బయటపడాలి: గోయెల్‌

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మావోయిస్టు, నక్సల్స్‌ చేతుల్లోకి వెళ్లాయని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ విమర్శించారు. ఒకవేళ రైతు సోదరులు వారి చేతుల నుంచి బయట పడితే తప్పకుండా........

Published : 12 Dec 2020 23:10 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మావోయిస్టు, నక్సల్స్‌ చేతుల్లోకి వెళ్లాయని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ విమర్శించారు. ఒకవేళ రైతు సోదరులు వారి చేతుల నుంచి బయట పడితే తప్పకుండా కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రయోజనాల గురించి అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

‘రైతులు తమ నిరసనలు వారి చేతుల్లో నుంచి మావోయిస్టు, నక్సల్స్‌ చేతుల్లోకి పోయాయని అర్థం చేసుకోవాలి. వారి ప్రభావం నుంచి బయటపడి పరిష్కారం దిశగా చర్చల్లో పాల్గొంటారని భావిస్తున్నాం. చర్చల్లో ఒకే విషయాన్ని పట్టుకుని కూర్చుంటే సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కాదు. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం 24 గంటలు తలుపులు తెరిచే ఉంచుతుంది. చాలా మంది రైతులు కేంద్రం తెచ్చిన చట్టాలకు కట్టుబడి ఉన్నారు. కానీ కొందరికి అనుమానాలు ఉన్నాయి వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. నక్సల్స్‌ వారిలో భయాందోళన వాతావరణం సృష్టించారు. అందుకే రైతులు ప్రభుత్వం తరఫున వారి డిమాండ్లపై చిన్న స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఒప్పుకోవడం లేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే పనిచేస్తోంది’ అని గోయెల్‌ వెల్లడించారు. 

ఇదీ చదవండి

మిస్టరీ స్పిన్నర్‌ ఓ ఇంటివాడయ్యాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని